బాలకృష్ణ, రోజా... ఈ కాంబినేషన్ సినిమాల్లో హిట్టు. కానీ రాజకీయాల్లో వీరిద్దరివీ భిన్న మార్గాలు. బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా వుంటే రోజా నగరి ఎమ్మెల్యే తో పాటు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(ఏపీఐఐసీ) చైర్మన్ గానూ వున్నారు.
'రోజాతో ఇంతకు ముందే మాట్లాడాను. తప్పకుండా అభివృద్ధి చేద్దాం బాబు అని ఆమె చెప్పారు. ఎప్పుడైనా విజయవాడ వచ్చినప్పుడు తన కార్యాలయానికి రావాలని, అధికారులందరినీ అక్కడికే పిలిపిస్తానని రోజా చెప్పారు. కరోనా తర్వాత ఒకసారి వెళ్లి కలుస్తా’ అని బాలకృష్ణ ప్రకటించారు.