అగ్రిగోల్డ్ కేసులో కీలక అరెస్ట్

మంగళవారం, 22 మే 2018 (20:34 IST)
అగ్రిగోల్డ్ సంస్థ కేసులో మరో కీలక అరెస్ట్ జరిగింది. అగ్రిగోల్డ్ సంస్థ మోసం వెలుగుచూసినప్పటి నుండి అజ్ఞాతంలోకి వెళ్లిన వైస్ ఛైర్మన్ సీతారామారావును ఢిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అగ్రిగోల్డ్  చైర్మన్ వెంటకరామారావుకు ఈయన సోదరుడు. కేసు నమోదయిన వెంటనే ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నాడు సీతారామారావు. హైకోర్ట్ బెయిల్ నిరాకరించడంతో సీతారాం అజ్ఞాతంలోకి వెళ్లారు. 
 
అప్పటి నుండి ఆయనను పట్టుకునేందుకు అధికారులు ప్రత్యేక పోలీసులు బృందాలను రంగంలోకి దింపారు. ఆయన ఢిల్లీలో తలదాచుకున్నారని పక్కా సమాచారంతో ఏపీ నుంచి వెళ్లిన సీఐడీ అధికారులు ఢిల్లీలో సీతారామారావును అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న సీతారామారావును మరో రెండు రోజుల్లో విజయవాడకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. 
 
సీతారామారావును అరెస్టు చేయడంతో అగ్రిగోల్డ్ బాధితులు హర్షం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులు ఎస్ఎల్ గ్రూప్ కొనుగోలు చేయకుండా  సీతారామారావు అడ్డుకుంటున్నారని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ అరెస్ట్ కీలకం కానుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు