శేఖర్ రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు వరుసగా నాలుగో రోజైన ఆదివారం సోదాలు నిర్వహిస్తున్నారు. ఐటీ శాఖ చేపట్టిన సోదాల్లో కళ్లు చెదిరేలా ఆస్తులు బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు 170 కిలోల బంగారం, రూ.131కోట్ల నగదు, రూ.వెయ్యి కోట్లకు పైగా ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల చెన్నైలో కోట్ల రుపాయల ఆస్తులతో ఐటీ అధికారులకు పట్టుబడ్డ టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్‌రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయడు అఖిలేశ్, జయలలిత సన్నిహితురాలు శశికళ బినామీయేనని అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు.
చంద్రబాబు బినామీలు ప్రస్తుతం నోట్ల మార్పిడి పనిలో ఉన్నారని దుయ్యబట్టారు. అసలు ఏ ప్రాతిపదికన శేఖర్‌రెడ్డిని టీటీడీ బోర్డు మెంబర్‌గా ఎన్నిక చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నారా లోకేష్‌కు రూ. 100 కోట్లు చెల్లించి శేఖర్‌రెడ్డి టీటీడీ బోర్డు సభ్యుడిగా అయ్యారని తెలుస్తున్నదని అంబటి రాంబాబు పేర్కొన్నారు.