ఈ ఘటనపై వెంటనే స్పందించిన స్థానికులు ఆ బాలికను స్థానిక ఆసుపత్రికి తరలించి, పోలీసులు సమాచారం అందించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.
ప్రేమ జంట ఆత్మహత్య
మరోవైపు, తెలంగాణాలో ఆదిలాబాద్ జిల్లా నాగర్ కర్నూల్ మండలం కంపూర్‌లో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఒకరినొకరు ఇష్టపడిన ఆ ప్రేమజంట తమ ప్రేమ వ్యవహారం విషయం పెద్దల దృష్టికి తీసుకెళ్లగా, వారుకూడా సమ్మతించి నిశ్చితార్థం కూడా జరిపారు. అయితే, లాక్డౌన్ కారణంగా వారి పెళ్లి వాయిదాపడింది. దీంతో మనస్తాపం చెందిన ఆ ప్రేమికులు పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నారు.