తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు రాజధానిపై క్లారిటీ ఇచ్చారు. విజయవాడ-గుంటూరుల మధ్యే రాజధాని నగరం ఏర్పాటు వుంటుందని స్పష్టం చేశారు. కర్నూలులో విలేకరులతో జరిగిన ఇష్టాగోష్టిలో చంద్రబాబు ఏపీ రాజధాని విషయంలో స్పందించారు. రాజధాని అవకాశాలు ప్రకాశం జిల్లా దొనకొండకు ఏ మేరకు ఉన్నాయని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు చంద్రబాబు ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
ఈ విషయాన్ని వివరించడానికి చంద్రబాబు ఓ ఉదాహరణను విలేకరులకు చెప్పారు. మాజీముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సొంత ప్రాంతం మీద ప్రేమతో కడప జిల్లాలోని ఇడుపులపాయ గ్రామంలో ఓ వెటర్నరీ రీసెర్చ్ కేంద్రాన్ని... ఓ ఐఐటి ని నెలకొల్పారని, అయితే... ప్రస్తుతం అక్కడు పని పనిచేయడానికి ఫ్రొపెసర్లు, పరిశోధకులు ముందుకురావట్లేదని చెప్పారు.