మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు చంపేస్తారనీ.. దళిత యువకుడి ఆత్మహత్య...

బుధవారం, 26 ఆగస్టు 2020 (10:24 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో దళిత యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అధికార వైకాపా నేతలు బెదిరింపులకు భయపడి తనువు చాలించాడు. ఈ విషాదకర ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని  పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం కందూరు గ్రామం బండకాడపల్లి  దళితవాడకు చెందిన ఓం ప్రతాప్ అనే యువకుడు మద్య నిషేధం పేరుతో జగన్ రెడ్డి చేస్తున్న దోపిడీ గురించి సోషల్ మీడియాలో తన ఆవేదనను వెళ్లగక్కాడు. 
 
జగన్ రెడ్డి బ్రాండ్లు, అధిక రేట్లతో పేదలను ఏ విధంగా దోచుకుంటున్నారో ఓం ప్రతాప్ వివరించాడు. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి గెలిపించినందుకు మమల్ని దోచుకుంటావా జగన్ రెడ్డి అంటూ యువకుడు ప్రశ్నించాడు. నాలుగైదు రోజుల క్రితం మదనపల్లిలో ఓ వైన్ షాపు వద్ద ఓం ప్రతాప్ తన ఆవేదనను వెళ్లగక్కుతూ పోస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
 
దీంతో రంగంలోకి దిగిన ఆ జిల్లాకు చెందిన మంత్ర పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ రెడ్డప్ప మనుషులు బెదిరింపులకు దిగినట్టు సమాచారం. పైగా చంపేస్తాం అంటూ ఫోనులో బెదిరిస్తూ వేధించినట్టు వినికిడి. వారి వేధింపులు భరించలేని ఓం ప్రతాప్ ఆత్మహత్య చేసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు