ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా, మంగళవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇందులోభాగంగా, ముందుగా పోస్టల్ ఓట్లను లెక్కించారు. ఇందులో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి దూసుకునిపోతుంది. ఈ పోస్టల్ ఓట్లలో టీడీపీ ఏకంగా 31, జనసేన 5, బీజేపీ 1 స్థానంలో ఆధిక్యంలో ఉండగా, కూటమి అభ్యర్థులు మొత్తంగా 37 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2024 : పవన్ కళ్యాణ్ గెలుపుపై సర్వత్రా ఆసక్తి!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడనున్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ గెలుపుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అందుకే ప్రతి ఒక్కరి నోటా పవన్ మాటే వినిపిస్తుంది. దీనికి కారణం లేకపోలేదు. గత ఎన్నికల్లో తాను పోటీ చేసిన రెండు చోట్లా పవన్ కళ్యాణ్ ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో ఆయన పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. పైగా, పిఠాపురంలో ఎన్నడూలేని విధంగా 86.63శాతం పోలింగ్ నమోదైంది. అర్థరాత్రి వరకూ మహిళలు సైతం పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.