విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు.. మౌనంగా టీడీపీ..

గురువారం, 27 జనవరి 2022 (11:58 IST)
ఏపీలో జిల్లాల ఏర్పాటులో భాగంగా కృష్ణా జిల్లా రెండు జిల్లాలుగా అవతరిస్తోంది. ఇందులో విజయవాడ కేంద్రంగా ఏర్పాటు కాబోతున్న జిల్లాకు "ఎన్టీఆర్ జిల్లా" అని పేరు పెట్టారు. తద్వారా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన హామీని నిలుపుకోవడమే కాకుండా... దివంగత ఎన్టీఆర్‌కు ఘన నివాళి అర్పించినట్టయింది. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. గత టీడీపీ హయాంలో కూడా కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చ జరిగింది. 
 
మరోవైపు, ఎన్టీఆర్ జిల్లాను జగన్ ప్రకటించడంపై టీడీపీ శ్రేణులు మౌనంగా ఉన్నాయి. కనీసం సోషల్ మీడియాలో కూడా ఎవరూ స్పందించలేదు. ఎన్టీఆర్ కుమార్తె, బీజేపీ నాయకురాలు పురందేశ్వరి మాత్రం ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... ఎన్టీఆర్ జిల్లాను స్వాగతిస్తున్నట్టు తెలిపారు. ఇకపోతే.. కొత్త జిల్లాల విభజనలో భాగంగా 26 జిల్లాలను ఏర్పాటు చేయబోతున్నట్టు సీఎం ప్రకటించారు. ఇంకా విజయవాడకు ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టడం వైకాపాకు రాజకీయంగా కలిసొస్తుందని టాక్ వినిపిస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు