విశాఖలో స్వైన్ ప్లూ.. తొలి కేసు నమోదు.. బాలుడికి నిర్ధారణ..!

గురువారం, 29 జనవరి 2015 (10:52 IST)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ‌పట్నంలో కూడా స్వైన్ ఫ్లూ మహమ్మారి ప్రవేశించింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రాన్ని స్వైన్ ఫ్లూ వ్యాధి వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్థితిలో స్వైన్ ఫ్లూ అనుమానాలతో ఇద్దరు బాలురు విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రిలో చేరారు. వారికి వైద్యలు పరీక్షలు జరగా వారిలో ఒక బాలునికి స్వైన్ ఫ్లూ పాజిటివ్ నివేదిక వచ్చింది. 
 
దీంతో ఆ బాలుడికి స్వైన్ ఫ్లూ వ్యాధి సోకినట్లు నిర్ధారించారు. అప్రమత్తమైన వైద్యాధికారులు ఆస్పత్రిలో స్వైన్ ఫ్లూ వైద్యానికి కావలసిన చర్యలను చేపట్టారు. ఈ విషయం గురించి కింగ్ జార్జి పర్యవేక్షక వైధ్యాధికారి డాక్టర్ ఎం. మధుసూధనబాబు మాట్లాడుతూ...  పెదవాల్తేరు నుంచి బుధవారం ఒర బాలుడు స్వైన్ ప్లూ అనుమానిత లక్షణాలతో వచ్చాడని  తెలిపారు. స్వైన్ ప్లూ వార్డులో కేంద్రీకృత ఆక్సిజన్ సరఫరా వ్యవస్ధతో పాటు వెంటిలేటర్లను సిద్ధంగా ఉంచామన్నారు.
 
స్వైన్ ప్లూ రోగులకు వైద్య పరీక్షలు చేసేందుకు వైద్యులకు, నర్సులకు ప్రత్యేకంగా 350 వ్యక్తిగత కిట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. నగరంలో స్వైన్ ప్లూ కేసు నమోదు కావడంతో ఆరోగ్య శాఖ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

వెబ్దునియా పై చదవండి