టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ నేతలు, శ్రేణులు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌ను పాటిస్తున్నాయి. అయితే, శనివారం నుంచి టీడీపీ నేతలు తమ నిరసనను తెలుపుతున్నారు. ఇందులోభాగంగా, తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో టీడీపీ నేతలు చేపట్టిన రిలే నిరాహార దీక్ష టెంట్‌ను స్థానిక పోలీస్ ఎస్ఐ నరసింహా రావు కూల్చివేశారు.
ఈ టెంట్‌లో దీక్ష చేస్తున్న టీడీపీ మాజీ పుర ఉపాధ్యక్షుడు బీరం రాజేశ్వరరావును ఎస్ఐ నరసింహారావు చొక్కా పట్టుకుని బలవంతంగా ఈడ్చుకెళ్లారు. దీంతో రాజేశ్వరరావు, బాబులు ఎస్ఐ నరసింహారావు కాళ్లు పట్టుకుని శాంతియుతంగా చేస్తున్న దీక్షను భగ్నం చేయవద్దని వేడుకున్నప్పటికీ వారు కనికరించలేదు.. తమ పోలీసు కండకావరాన్ని ప్రదర్శించారు. నేతలను బలవంతంగా స్టేషన్‌కు తరలించారు. ప్రసాద్, చంద్రమౌళి రెడ్డి, శివ, శ్రీనివాసులు, చంగారావు, మునేంద్రను పోలీసులు అరెస్టు చేశారు.