ఆగస్టు నుంచి ఏపీలో విద్యా సంస్థలు ప్రారంభం

శుక్రవారం, 2 జులై 2021 (21:32 IST)
ఏపీలో విద్యా సంస్థలు ప్రారంభం కానున్నాయి. ఏపీలో విద్యాసంస్థలను ఆగస్టు నుండి ప్రారంభించే ప్రయత్నం చేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి సురేష్ అన్నారు. ప్రత్యక్ష క్లాసులు లేనందున 70 శాతం మాత్రమే ఫీజులు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. 
 
మూడు నాలుగు రోజుల్లో రెగ్యులేటింగ్, మానిటరింగ్ కమిటీ ఫీజులపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని చెప్పారు. అంతేకాకుండా సెట్ పరీక్షలు కూడా ఆగస్టులోనే జరుగుతాయన్నారు. అంతేకాకుండా హైపవర్ కమిటీ సూచనల తోనే ఇంటర్ మరియు పదవ తరగతి ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు.
 
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్‌లో సడలింపులు చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప‌రిస్థితులు చూసిన‌ట్ల‌యితే తెలంగాణలో లాక్ డౌన్‌ను ఇప్పటికే పూర్తిగా ఎత్తివేశారు. 
 
కానీ ఏపీలో కొన్ని జిల్లాల్లో లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. కానీ ఇప్పటికే ఏపీలో కూడా మాల్స్,  జిమ్ లు, ప‌బ్ లు అన్ని తెరిచారు. దాంతో విద్యాసంస్థలు ఎప్పుడు ప్రారంభం అవుతాయి అన్న చర్చ మొదలయింది. తెలంగాణలో ఇప్ప‌టికే ఆన్లైన్ క్లాసులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి