బ్యూటీ ఆఫ్ డెమోక్రసీని ఈ చట్ట సభలో మళ్లీ చూపిస్తా: జగన్ హామీ

గురువారం, 13 జూన్ 2019 (11:38 IST)
బ్యూటీ ఆఫ్ డెమోక్రసీని ఈ చట్ట సభలో మళ్లీ చూపిస్తానని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికైన తరువాత వైఎస్ జగన్, ముఖ్యమంత్రి హోదాలో ప్రసంగిస్తూ హామీ ఇచ్చారు.


బ్యూటీ ఆఫ్ డెమోక్రసీని ఈ చట్ట సభలో మళ్లీ చూపిస్తానని జగన్ స్పష్టం చేశారు. టెండర్ల వ్యవస్థలోనూ, గ్రామస్థాయిలోనూ, ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతిని తొలగించి, విలువలు, విశ్వసనీయతకు రాష్ట్రాన్ని కేరాఫ్ అడ్రస్ గా చేసి చూపిస్తానని చెప్పుకొచ్చారు. 
 
ఇందుకోసం తమ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలను మొదలెట్టిందని.. అందుకే నిజాయితీగల తమ్మినేనిని స్పీకర్‌గా ప్రకటించామని జగన్ తెలిపారు. ఓ స్పీకర్, ఓ లీడర్ ఆఫ్ ది హౌస్ ఎలా ఉండకూడదో, గత శాసనసభను చూస్తే అర్థం అయిందని, ఎలా ఉండాలో చెప్పడానికి ఈ శాసనసభ, ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుందని వెల్లడించారు.
 
అంతేగాకుండా.. తెలుగుదేశం పార్టీపై జగన్ ఆసక్తికర కామెంట్లు చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన తెలుగుదేశం పార్టీ విషయంలో దేవుడు అద్భుతమైన స్క్రిప్ట్ రాశాడని జగన్ వ్యాఖ్యానించారు. దేవుడు రాసిన స్క్రిప్ట్ ఎంత గొప్పగా ఉంటుందనడానికి, జరిగిన ఎన్నికలే అధ్యక్షా నిదర్శనమని జగన్ ఎత్తిచూపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు