ఇందులో కీలక ఆర్డినెన్సులు అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదానికి రానున్నాయి. ఈ ఏడాది జులై నుంచి ఇప్పటివరకు వివిధ శాఖలకు సంబంధించి 14 ఆర్డినెన్సులను ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. ఒకే రోజున 14 ఆర్డినెన్సులు అసెంబ్లీ, మండలి ముందుకు రానున్నాయి.
మరోవైపు డిసెంబర్‌లో మరోసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. మండలి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను డిసెంబర్‌లో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేబినెట్ భేటీ వాయిదాపడింది.