లోకేష్‌కు మంత్రి పదవా...? ఇంకా చేయాల్సింది చాలా ఉంది... సీఎం చంద్రబాబు

శుక్రవారం, 26 ఆగస్టు 2016 (19:23 IST)
నారా లోకేష్ బాబుకు త్వరలో జరుగబోయే మంత్రివర్గ విస్తరణలో మంత్రి బెర్త్ దక్కనుందనే వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆయన ఓ టెలివిజన్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... లోకేష్ పనితీరు బ్రహ్మాండంగా ఉందనీ, టెక్నాలజీని వినియోగించుకోవడం, టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో బాగా మెరుగ్గా ఉన్నారని చెప్పారు. 
 
ఐతే ఇంకా చాలా విషయాల్లో ఆయన తన పనితీరును మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. పార్టీ కార్యకర్తలతో ఆయన మమేకమయ్యే తీరు సంతృప్తికరంగా ఉందనీ, తన అంచనాలకు తగ్గట్లుగా ఆయన పనిచేస్తారని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. ఇక మంత్రి పదవి అనేది సరైన సమయంలో ఆయనకు వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి