ఈ పథకం కింద ఏటా రూ. పదివేలు చెల్లిస్తున్న విషయం తెలిసిందే. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, భూమి వివరాలు, ఆదాయపన్ను, విద్యుత్ వినియోగం, కులం వంటి వివరాలతో కూడిన పత్రాలను స్థానిక గ్రామ సచివాలయాల్లో సమర్పించాల్సి ఉంటుంది.
అర్హులైన లబ్దిదారుల జాబితాను ఎంపీడీవో లేదా మునిసిపల్ కమిషనర్ కార్యాలయాల్లో ఈ నెల 9లోగా ఆమోదించి 10న కలెక్టరుకు వివరాలు ఇస్తారు. తర్వాత 11,12 తేదీల్లో సంబంధిత కార్పొరేషన్‌కు పంపిస్తారు. తర్వాత వాటిని పరిశీలించి అర్హులకు ఆర్దిక సహాయం చేస్తారు.