బడా నేతలు ఈ మధ్య తన మనో భావాలను ట్వీట్ల ద్వారానే తెలియజేస్తున్నారు. ఇదే కోవలో యువ నేతలు కూడా నిత్యం ట్వీట్లు చేస్తున్నారు. నేను ఒంటరిని అయిపోయానంటూ, వై.ఎస్. షర్మిల ట్వీట్ చేయగా, ఏపీ సీఎం, షర్మిల అన్న వై.ఎస్. జగన్ మాత్రం తన ట్వీట్ ని హుందాగా చేశారు.
నాన్న భౌతికంగా దూరమై 12 ఏళ్లయినా, జనం మనిషిగా, తమ ఇంట్లోని సభ్యునిగా నేటికీ జన హృదయాల్లో కొలువై ఉన్నారు. చిరునవ్వులు చిందించే ఆయన రూపం, ఆత్మీయ పలకరింపు మది మదిలోనూ అలానే నిలిచి ఉన్నాయి. నేను వేసే ప్రతి అడుగులోనూ, చేసే ప్రతి ఆలోచనలోనూ నాన్న స్ఫూర్తి ముందుండి నడిపిస్తోంది అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.