హీరో కృష్ణ పార్థివదేహానికి సీఎం జగన్ నివాళులు

బుధవారం, 16 నవంబరు 2022 (12:45 IST)
వృద్దాప్యంతో పాటు అనారోగ్యం కారణంగా మంగళవారం వేకువజామున తుదిశ్వాస విడిచిన హీరో కృష్ణ పార్థివదేహానికి ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి బుధవారం నివాళులు అర్పించారు. ఇందుకోసం ఆయన విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక హెలికాఫ్టరులో వెళ్లారు. 
 
అక్కడ పద్మాలయ స్టూడియోస్‌లో అభిమానుల సందర్శనార్థం ఉంచిన పార్థివదేహానికి పుష్పగుచ్ఛం ఉంచిన సీఎం జగన్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న హీరో మహేష్ బాబును సీఎం జగన్ ఆలింగనం చేసుకుని ఓదార్చారు. ఆ తర్వాత కృష్ణ కుటుంబ సభ్యులకు ఆయన ధైర్యం చెప్పారు. 
 
కాగా, కృష్ణ పార్థివదేహానికి అంతిమ సంస్కారాలు బుధవారం మధ్యాహ్నం నిర్వహిస్తారు. జుబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో పూర్తి చేస్తారు. ఈ సందర్భంగా మహాప్రస్థానంలో ఏర్పాట్లు చేసి భారీ భద్రతను కల్పించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు