ఏపీ సీఎం ఎపుడూ తాడేపల్లిలోనే ఉంటారు...అసలు బయటకు కాలు పెట్టడు... అనేది ప్రతిపక్షాల విమర్శ. ఎంత సేపూ ఆన్ లైన్ లో పథకాల సమీక్ష, వీలైతే... ఒక్క మీట నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా డబ్బు పంపిణీ... ఇది తప్ప ఆయన దర్శనాలు బయట ఎక్కడ అని ప్రశ్నిస్తుంటారు.
కానీ, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీనే డిఫరెంట్. ఆయన ఎప్పుడు ఎక్కడకి రావాలనేది అంతా సూపర్ ప్లానింగ్. గత సీఎం చంద్రబాబులా ప్రతి చిన్న దానికి ఆయన టూర్లు చేయరు. జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారుల అడ్రినిస్ట్రేషన్లో తల దూర్చరు. చివరికి శానిటేషన్ పనులకు కూడా ఏపీ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు గతంలో హాజరయిపోయేవారు. అంతా తానై విధుల్ని నడిపిస్తున్నట్లు భావించేవారు.
కానీ, ఏపీ నవ, యువ సీఎం జగన్ మాత్రం అంతా తన ప్లానింగ్ ద్వారానే ప్రోగ్రామింగ్ చేసుకుంటారు. పథకాల అమలు, కింది స్థాయి విధుల నిర్వహణలో జిల్లా యంత్రాంగాలు పనిచేయాలనేది ఆయన భావన. అందుకే ఆయన అంతా తాడేపల్లిలో కూర్చునే అడ్మినిస్ట్రేషన్ కింది స్థాయిలో సూపర్ విజన్ చేస్తారు. ఆయన కేవలం తాడేపల్లి తన క్యాంపు కార్యాలయానికే పరిమితం అయిపోయారనే వాదన ప్రతిపక్షాలదని, ప్రతి చిన్న కార్యక్రమానికి సీఎం ఎందుకుని ఆయన పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
తన హాజరు అవసరం అయిన ప్రతి చిన్న ఫంక్షన్ కి కూడా సీఎం వస్తారనేదానికి ఉదాహరణ... నేడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సీఎం పర్యటనే అని చెపుతున్నారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసు బాబు కుమార్తె వివాహ వేడుకకు సీఎం వైయస్. జగన్ హాజరయ్యారు. వధువు స్నిగ్ధ, వరుడు హనీష్ లను ఆశీర్వదించారు. పశ్చిమ గోదావరి జిల్లా బీమవరం కే కన్వెన్షన్ కళ్యాణ మండపంలో శనివారం ఉంగుటూరు శాసనసభ్యులు పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహ మహోత్సవానికి ఇలా సీఎం హాజరై వధూవరులను ఆశీర్వదించి వెళ్లారు.