ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం గురువారం జరుగనుంది. ఈ సమావేశం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన జరుగనుంది. సీఎం జగన్ తన మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీకరణ తర్వాత జరుగుతున్న తొలి సమావేశం.
ఇది సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. ఈ సమావేశానికి సీఎం వైఎస్ జగన్ అధ్యక్షత వహిస్తారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అన్ని శాఖలకు ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సమావేశంలో ప్రధానంగా మూడు రాజధానుల అంశంపై చర్చించే అవకాశం ఉంది. అలాగే,రాబోయే ఎన్నికలపై సీఎం వైఎస్ జగన్ మంత్రులకు దిశానిర్దేశం చేస్తారని సమాచారం.
ఈ భేటీలో సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. ముందుగా కేబినెట్ సమావేశం మే 13న జరగాల్సి ఉండగా ముందుగా వాయిదా పడింది.