ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తేరుకోలోని షాకిచ్చింది. కొత్త వేతన స్కేలు ప్రకారం వేతనాలు ఇవ్వాలంటూ తాజాగా ఆదేశాలు జారీచేసింది. అంటే.. ఇటీవల ఏపీ సర్కారు ప్రకటించిన కొత్త పే రివిజన్ స్కేల్ (పీఆర్సీ) ప్రకారమే జీతాలు ఇవ్వనుంది. దీంతో వచ్చే నెల నుంచి ఉద్యోగులకు కొత్త పే స్కేల్ ప్రకారం వేతనాలు అందనున్నాయి.
నిజానికి ఈ పీఆర్సీని ప్రభుత్వ ఉద్యోగులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వాన్ని నిర్ణయానికి వ్యతిరేకంగా ఇప్పటికే తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇపుడు తమ ఆందోళనను మరింత ఉధృతం చేయాలని వారు నిర్ణయించారు. అయితే, ప్రభుత్వం మాత్రం ఉద్యోగుల ఆందోళలను కనీసం పట్టించుకోకుండా కొత్త వేతనాన్ని వచ్చే నుంచి ఇవ్వాలంటూ ఉత్తర్వులు జారీ చేయడంతో వారు మరింత ఆగ్రహానికి లోనవుతున్నారు.
మరోవైపు, ప్రభుత్వం జారీచేసిన పీఆర్సీకి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉపాధ్యాయుల కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తంగా మారుతోంది. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి వారిని ప్రభుత్వం పోలీసులను రంగంలోకి దించి అరెస్టులు చేయిస్తుంది.