ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి హైకోర్టులో ఎదురుదెబ్బ

సోమవారం, 27 డిశెంబరు 2021 (16:54 IST)
ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజులను మీరెలా నిర్ణయిస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రంలో ప్రైవేట్ స్కూలు, జూనియర్ కాలేజీ అభిప్రాయాలను తీసుకున్న తర్వాతనే ఫీజులను ఖరారు చేయాలని సూచించింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రయివేట్ స్కూల్స్, జూనియర్ కాలేజీల ఫీజులను ఖరారు చేస్తూ.. జీవో 53, 54లను జారీ చేసిన సంగతి తెలిసిందే. 
 
ఈ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ.. ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యం హైకోర్టుని ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజులను మీరెలా నిర్ణయిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిబంధనలు, చట్టాలకు వ్యతిరేకంగా జీవోలు ఇచ్చారంటూ ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను హైకోర్టు కొట్టివేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు