ఏపీలో రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ

మంగళవారం, 18 జనవరి 2022 (08:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చర్యలను మరింత కఠినతరం చేయనుంది. ఇప్పటికే పలు ఆంక్షలను విధించి అమలు చేస్తున్న సర్కారు... మంగళవారం నుంచి రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేయనుంది. ఈ కర్ఫ్యూ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉంటుంది. అయితే, అంతర్రాష్ట్ర సరకు రవాణాకు మాత్రం కర్ఫ్యూ నుంచి మినహాయింపునిచ్చారు. 
 
అంతేకాకుండా, సామాజిక కార్యక్రమాలు, మతపరమైన, వివాహాది శుభ కార్యాలలకు పరిమిత సంఖ్యలో అంటే గరిష్టంగా 200 మందికి మంచి పాల్గొనకుండా, హాలులో అయితే వంద మందితో నిర్వహించేలా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
 
మరోవైపు, సోమవారం వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన మేరకు రాష్ట్రంలో కొత్తగా 4,108 మందికి కరోనా వైరస్ సోకిన విషయం తెల్సిందే.మొత్తం 22,882 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా, ఈ కేసులు బయటపడ్డాయి. అత్యధికంగా విశాఖ జిల్లాలో 1,018 కొత్త కేసులు, చిత్తూరులో 1,004 చొప్పున పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు