ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి మేకపాటి గౌతం రెడ్డి సోమవారం హఠాన్మరణం చెందారు. ఆయన తీవ్రగుండెపోటుకు గురికావడంతో ఆయన్ను హైదరాబాద్ అపోలో ఆస్పత్రికి తరలించారు. కానీ ఆయన అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించారు. అయితే, మేకపాటి గౌతం రెడ్డి మృతిపట్ల తెలంగాణ మంత్రులు, నేతలు తీవ్ర దిగ్భ్రాంతితో పాటు తమ సంతాపాలను తెలిపారు.