22న ఏపీ మంత్రి వర్గ విస్తరణ

సోమవారం, 20 జులై 2020 (17:48 IST)
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం త్వరలో మంత్రివర్గాన్ని విస్తరించనుంది. ఈ మేరకు ఈ నెల 22 తేదీన ఒంటి గంట తర్వాత కేబినెట్ విస్తరణ జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. అదే రోజు ఇద్దరు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం.

రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ, పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుకు కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలో శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన వేణుగోపాలకృష్ణకు పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో మంత్రిపదవి దక్కనుంది.

అటు మోపిదేవి వెంకటరమణ సామాజికి వర్గానికి డా.సీదిరి అప్పలరాజు తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. ఇదే సమయంలో మంత్రుల శాఖల్లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని అధికార పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు. 

గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవులకు అభ్యర్థులను వైసీపీ ఖరారు చేసింది. ఇద్దరికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వాలని ఏపీ సీఎం జగన్‌ నిర్ణయించుకున్నారు. దీంతో రాయచోటికి చెందిన మైనార్టీ మహిళా నేత మైనా జకియాఖానుం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్సీ వర్గానికి చెందిన మోసేను రాజుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు