ఏపీ పాలిసెట్-2022 ఫ‌లితాలు విడుదల

శనివారం, 18 జూన్ 2022 (11:26 IST)
AP polycet results 2022
ఏపీ పాలిసెట్-2022 ఫ‌లితాలు విడుదలయ్యాయి. ఈ ఫ‌లితాల‌ను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విడుదల చేశారు. ఈ ఫలితాల్లో బాలురు 90.56 శాతం, బాలికలు 93.96 శాతం ఉత్తీర్ణులయ్యారు. 1,31,608 మంది పరీక్షలు రాయగా.. వీరిలో మొత్తం 91.84 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు.  
 
రిజిస్ట్రేషన్‌ వివరాలు, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా లాగినై AP POLYCET Results 2022 ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. ఒకవేళ అర్హత మార్కుల్లో ఎవరికైనా సమానంగా మార్కులు వచ్చినట్లయితే మ్యాథమాటిక్స్, ఫిజిక్స్‌, పుట్టిన తేదీల వారీగా సరిచూసి ర్యాంకును కేటాయిస్తారు.
 
పాలిటెక్నిక్‌, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు మే 29వ తేదీన‌ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పాలీసెట్‌ను స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు