కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని బండి ఆత్మకూరులో ఏపీఎస్పీ 9వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు దారుణ హత్యకు గరైయ్యాడు. అతడి తల ఆత్మకూరులో కనిపించగా.. కోడూరు వద్ద మొండాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో తల, మొండెంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆస్తి తగాదాలు, వివాహేతర సంబంధమా లేక ఇతర ఏమైనా కారణాల అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.