ఏపీ విభజనపై షిండే, చిదంబరం, ఆజాద్‌లకు అరెస్టు వారెంట్లు...

శుక్రవారం, 22 ఆగస్టు 2014 (18:10 IST)
ఆంధ్రప్రదేశ్ విభజనను అస్తవ్యస్తంగా చేశారంటూ ముగ్గురు మాజీ కేంద్ర మంత్రులపై కోర్టులో దాఖలైన పిటీషన్ నేపధ్యంలో ఆ ముగ్గురూ కోర్టుకు హాజరు కాలేదు కాబట్టి అరెస్ట్‌ చేయాలంటూ అనంతపురం కోర్టు వారెంట్లు జారీ చేసింది. ఏపీ రాష్ట్ర విభజన అంశానికి సంబంధించిన కేసులో వీరికి వారెంట్లు జారీ అయ్యాయి. గత యూపీఏ ప్రభుత్వంలో రాష్ట్ర విభజనపై నియమించిన జీవోఎం సభ్యులైన సుశీల్ కుమార్ షిండే, గులాం నబీ ఆజాద్, పి. చిదంబరంలపై బెయిల్‌బుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేస్తున్నట్లు శుక్రవారం కోర్టు పేర్కొంది. కోర్టుకు వారు హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి ఈ మాజీ కేంద్ర మంత్రులు ఈ కేసుపై ఎలా స్పందిస్తారో....

వెబ్దునియా పై చదవండి