అసెంబ్లీ వాయిదా

సోమవారం, 31 ఆగస్టు 2015 (11:06 IST)
వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రారంభమైన అసెంబ్లీ చర్చలు ఉదయం 11 గంటల ప్రాంతంలో వాయిదా పడ్డాయి. అధికార ప్రతిపక్షాల వాడీ వేడి ఆరోపణల నడుమనే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతికి, పుష్కరఘాట్ మృతులు, ప్రత్యేకహోదా కోరుతూ మరణించిన వారికి సంతాప తీర్మానాలను విడివిడిగా ప్రకటించారు. 
 
పుష్కరఘాట్ తొక్కిసలాటలో మరణించిన వారిది ప్రమాదం కాదని, ప్రభుత్వం చేయించిన హత్యలని జగన్ వ్యాఖ్యనించడం పట్ల గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. హత్యలు చేయించేది తాము కాదని ఎవరో జనానికి తెలుసునని వ్యాఖ్యానించారు. గందరగోళం నడుమే సంతాన్ని పాటించారు. అనంతరం సభను కొద్ది సేపు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ శివప్రసాద్ ప్రకటించారు. 

వెబ్దునియా పై చదవండి