జగన్‌ మెడపై పొడవాలని ప్లాన్... హత్య చేయడానికే దాడి... రిపోర్ట్

ఆదివారం, 28 అక్టోబరు 2018 (19:17 IST)
ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని హత్య చేసేందుకే నిందితుడు శ్రీనివాసరావు కోడి పందేల కత్తితో దాడికి పాల్పడ్డాడనీ పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కోడి పందేల కత్తితో జగన్ మోహన్ రెడ్డి మెడపై దాడి చేసి హత్య చేయాలని అతడు ప్రయత్నించాడనీ, ఒకవేళ అది మిస్ అయితే రెండో కత్తితో దాడి చేయాలని అనుకున్నాడనీ, ఐతే జగన్ మోహన్ రెడ్డి చాకచక్యంగా తప్పించుకున్నారని పోలీసులు రిపోర్టులో పేర్కొ న్నారు. 
 
రెండు కత్తులలో తొలుత ఒక కత్తితో పొడిచి అది గురి తప్పితే రెండో కత్తితో పొడవాలని ప్రణాళిక రచించాడని వెల్లడించారు. కాగా వైసీపీ అధినేతపై హత్యాయత్నం చేసిన శ్రీనివాసరావుకు వచ్చే నెల 2 వరకూ జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించించింది. మరోవైపు శ్రీనివాసరావు రాసిన లేఖతో పాటు అతనికి లేఖ రాయడంలో సాయం చేసిన మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు విచారిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు