నూటికి 100 పాళ్లు నూజివీడు రాజధాని... మంగళగిరి డౌటే... రేపే బాబు ప్రకటన

సోమవారం, 1 సెప్టెంబరు 2014 (21:59 IST)
మంగళగిరి రాజధాని ఆశలు మెల్లమెల్లగా సన్నగిల్లుతున్నాయి. సోమవారం ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సుమారు 5 గంటలపాటు రాష్ట్ర రాజధాని అంశంపై సుదీర్ఘంగా చర్చించిన మీదట రాజధాని ఎంపికపై స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. రైతులు ముందుకు వస్తే విజయవాడకు అత్యంత సమీపంలో ఉన్న మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిని ఏర్పాటు చేయాలని మంత్రిమండలి నిర్ణయించినట్లు తెలుస్తోంది. 
 
మంగళగిరి ప్రాంతంలో భూములు ధరలు ఆకాశానికి చూస్తున్న నేపధ్యంలో అక్కడ ప్రభుత్వ ధరకు రైతులు భూములను అమ్మడం సాధ్యపడకపోవచ్చు. ఈ పరిస్థితి ఎదురయితే మాత్రం నూజివీడును సెకండ్ ఆప్షన్ గా తీసుకోవాలని మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మంగళగిరి విజయవాడకు 17 కిలోమీటర్లు దూరంలో ఉంటే నూజివీడు 42 కిలోమీటర్ల దూరంలో ఉంది.
 
కాగా రాజధానికి అవసరమైన భూముల కోసం, భూసేకరణ చేయడానికి ప్రత్యేక కమిటీ వేయాలని, ఈ కమిటిలో మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉంటారని తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి