బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంలో ఇది ఆల్ టైం రికార్డు. గురువారం బాలాపూర్ వీధుల్లో ఊరేగింపు అనంతరం లడ్డూ వేలాన్ని నిర్వహించారు. నలుగురు స్థానికేతరులు సహా మొత్తం 25 మంది లడ్డూను వేలం పాడేందుకు పోటీ పడ్డారు. వీరిలో పలువురు రియల్ ఎస్టేట్ ప్రముఖులు, రాజకీయ నేతలు కూడా ఉన్నారు. గత సంవత్సరం రూ. 10.32 లక్షలకు లడ్డూను ఓ భక్తుడు పాడుకున్న సంగతి తెలిసిందే.