బాపు మృతి సాహితీ లోకానికి తీరని లోటు : గవర్నర్ నరసింహన్

సోమవారం, 1 సెప్టెంబరు 2014 (08:59 IST)
దర్శక దిగ్గజం బాపు మృతి తెలుగు సాహితీ ప్రపంచానికి తీరని లోటని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అభిప్రాయపడ్డారు. బాపు మరణంపై ఆయన స్పందిస్తూ బాపు మృతి తీరనిలోటు. తెలుగు సినీ దర్శకునిగా, చిత్రకారునిగా, రచయితగా సాహిత్యానికి చేసిన సేవ మరువలేనిది. ఆయన మృతితో తెలుగు సాహితీలోకానికి భర్తీ చేయలేని నష్టం కలిగిందన్నారు.
 
అలాగే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందిస్తూ.. దర్శకుడిగా, చిత్రకారుడిగా, రచయితగా బాపు సినీ, కళా, సాహిత్య రంగాలకు ఎంతో సేవ చేశారు. ఆయన లేని లోటు భర్తీ చేయలేనిది. బాపు మరణం తెలుగు ప్రజలకు, సినీరంగానికి, సాహిత్యలోకానికి తీరని లోటు. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ పేర్కొన్నారు.
 
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. బాపు గీత, బాపు రాత తెలుగువారి సంస్కృతిలో భాగమయ్యాయి. ఆయన ఇకలేరని తెలియడం ఎంతో ఆవేదన కలిగిస్తోంది. తెలుగు జాతి ఉన్నంత వరకు బాపు కార్టూన్లు, పుస్తకాలపై ముద్రించిన ముఖ చిత్రాలు సజీవంగా నిలబడతాయి. తెలుగుదనం ఉట్టిపడేలా చలనచిత్రాలు తీయడంలో ఆయనకు ఆయనే సాటి. బాపు మృతి చిత్రకారులకు, సినీ రంగానికి తీరనిలోటంటూ తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి