కూచిపూడి నాట్య గురువు యజ్ఞనారాయణ శర్మ ఇకలేరు

ఆదివారం, 12 జనవరి 2020 (15:32 IST)
ప్రముఖ కూచిపూడి నాట్య గురువు భాగవతుల యజ్ఞనారాయణ శర్మ ఆదివారం కన్నుమూశారు. ఆయన వయసు 90 యేళ్లు. ఈయన కూచిపూడి నాట్యానికి తన జీవితకాలంలో ఎనలేని సేవలు అందించారు. వెంపటి పెద సత్యం, చినసత్యంగార్లతో కలిసి అనేక ప్రదర్శనలు ఇచ్చారు. వేలాది మందికి కూచిపూడి నాట్యంలో శిక్షణ ఇచ్చారు. 
 
ఈయన కుమారుడు భాగవతుల వెంకటరామ శర్మ ప్రస్తుతం విజయ
వాడలో ప్రఖ్యాతి గాంచిన కూచిపూడి గురువులలో ఒకరు. శర్మగారికి ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు, మగపిల్లలు ముగ్గురు. వీరి శ్రీమతి ఐదేళ్ళ క్రితం చనిపోయారు. వీరు ప్రస్తుతం విజయవాడ నగరంలోని మారుతి నగర్‌ నాలుగో లైనులో తన స్వగృహంలో ఉంటున్నారు. అక్కడే కన్ను మూశారు. కూచిపూడి దిగ్గజాలలో ఒకరైన యజ్ఞనారాయణ శర్మ మృతి కూచిపూడి నాట్యానికి తీరని లోటని పలువురు కళాకారులు అభిప్రాయపడుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు