వివాదాల మధ్య తిరుమలలో అంజనాద్రి అభివృద్థికి భూమి పూజ...!
బుధవారం, 16 ఫిబ్రవరి 2022 (00:36 IST)
ఆంజనేయుడు పుట్టింది తిరుమలలోని అంజనాద్రిలోనే. మా దగ్గర ఆధారాలున్నాయి. కర్ణాటకలోని కిష్కింధలో పుట్టలేదు ఇదంతా ఎవరో కాదు తిరుమల తిరుపతి దేవస్థానం చెబుతున్న మాట. అయితే ఇందుకు విరుద్ధంగా కిష్కింధకు చెందిన స్వామిజీ గోవిందానందసరస్వతి ప్రెస్ మీట్ పెట్టి టిటిడి దైవద్రోహం చేస్తోందంటూ మండిపడ్డారు.
అయితే ఈ వివాదాల మధ్య రేపు తిరుమలలో వైభవోపేతంగా అంజనాద్రి అభివృద్థికి టిటిడి భూమి పూజ చేయనుంది. తిరుమలలో హనుమంతుడు పుట్టిన స్ధలంలోనే అభివృద్థి కార్యక్రమాలను చేపట్టనున్నారు.
ఇందుకోసం విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందస్వామి, అలాగే చిత్రకూఠం పీఠాధిపతి రామ భద్రాచారి మహరాజ్‌లు తిరుపతికి చేరుకున్నారు. ఈ సంధర్భంగా రామభద్రాచారి మీడియాతో మాట్లాడుతూ ఆంజనేయుడు తిరుమలలోనే జన్మించాడని చెప్పారు.
అంజనాద్రిలో హనుమంతుడు జన్మించినట్లు ఆధారాలున్నాయన్నారు. కొంతమంది గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మొత్తం మీద వివాదాల మధ్య రేపు తిరుమలలో వైభవోపేతంగా అంజనాద్రి అభివృద్థికి భూమి పూజ జరుగనుంది.