రాష్ట్రంలో రోడ్లపై గుంతలు పూల్చడానికి ఒక్క తట్ట మట్టి వేశారా అని నిలదీశారు. టీడీపీ హయాంలో నిర్మిచిన టిడ్కో ఇళ్లు బూజు పట్టగా, నేడు ఉన్న ఇళ్ళు కూల్చివేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటంలో గాంధీ, నెహ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీ విగ్రహాలను కూల్చివేసిన అధికారులు వైఎస్ విగ్రహానికి మాత్రం పోలీసులు కాపలా ఉండా కాపాడరన్నారు.
అలాగే, చంద్రబాబు రోడ్‌షోలో ఆయనను హతమార్చడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. ఈ కేసులో ఎమ్మెల్సీ, ఎమెల్సీలను ముద్దాయిలుగా చేర్చి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ముఖ్య అనుచరుడే ఈ రాళ్లదాడికి ప్రధాన సూత్రధారని ఆరోపించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హత్యకు రూ.250 కోట్లసు సుపారీ కుదుర్చుకున్నారని, దీనిపై విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.