వైకాపా నాయకుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు పేరు 22 సార్లు ఏసీబీ సమర్పించిన నివేదికలో పేర్కొన్నారనీ, తాజాగా సమర్పించిన నివేదికలోనూ చంద్రబాబు నాయుడు పేరును పదేపదే జోడించారని వెల్లడించారు. తను నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు నిజంగా నిప్పులాంటివారయితే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. చంద్రబాబు నాయుడు ఒకవేళ జైలుకు వెళితే ముఖ్యమంత్రి పీఠాన్ని ఎవరు అధిష్టించాలన్న దానిపై ఆ పార్టీలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం వుందని బొత్స ప్రకటించారు.