కొడుకు అసమర్థుడైతే.. బ్రాండ్ విలువ కొట్టుకుపోతుంది.. చంద్రబాబు

శనివారం, 2 మార్చి 2019 (10:19 IST)
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. కొడుకు అసమర్థుడైతే.. బ్రాండ్ విలువ కొట్టుకుపోతుంది. వైద్యుడు, లాయర్, సినిమా నటుడు రాజకీయ నాయకుడు ఎవరైనా అంతే.. అంటూ చంద్రబాబు ఆసక్తికర కామెంట్ చేశారు. కానీ ఆయన కుటుంబం విలువ ఎలా తెలుస్తుందని.. ఆయనకు కుటుంబం వుందే కదా అంటూ విమర్శలు చేస్తున్నారు. 
 
ఓ వ్యక్తికి ఓ బ్రాండ్ ఒక్కసారే వస్తుంది. ఆ వ్యక్తి కొడుకు సమర్థుడయితేనే ఆ బ్రాండ్ నిలబడుతుంది. కొడుకు అసమర్థుడు అయితే ఆ బ్రాండ్ విలువ కొట్టుకుపోతుందని బాబు వ్యాఖ్యానించారు. అయితే కొడుకు అసమర్థుడైతే అనే చంద్రబాబు వ్యాఖ్యలు చర్చకు దారి తీస్తున్నాయి. అసలు చంద్రబాబు లోకేశ్‌ను సమర్థుడు అంటున్నారా.. కాదా అనే దానిపై చర్చ సాగుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు