ఇటీవల అనంతపురంలో జరిగిన బహిరంగ సభలో జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్లో తనకు తప్పేమి కనిపించడం లేదని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.
ఏమిస్తామో చెప్పడానికే రెండేళ్లుపడితే... ఆ నిధులివ్వడానికి మరో రెండున్నరేళ్లు తీసుకుంటే రాష్ట్రానికి ఉపయోగం ఏముందని, ఈ మాటలే పవన్ కళ్యాణ్ అన్నారని గుర్తుచేశారు. ఇందులో తనకు తప్పేమీ కనిపించడం లేదన్నారు. అవసరమైనప్పుడు రావాల్సిన నిధులు పుణ్యకాలం గడిచిపోయిన తర్వాత వస్తే ఉపయోగం ఉండదన్నారు. సకాలంలో రాష్ట్రానికి నిధులు అందితేనే సమస్యలు పరిష్కరించగలమని ఆయన తెలిపారు.