ఏపీలో పరిశ్రమల స్థాపించే వారికి టోక్యోలోనే అనుమతులు : చంద్రబాబు వెల్లడి

శుక్రవారం, 28 నవంబరు 2014 (11:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వచ్చే జపాన్ పారిశ్రామికవేత్తలకు టోక్యోలోనే అనుమతులు మంజూరు చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇది జపాన్ పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు బాబు ప్రకటించిన బంపర్ ఆఫర్. 
 
ఇందుకోసం టోక్యోలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. అనుమతులు తీసుకోవడానికి ఆంధ్రాకు రానవసరంలేదని, అన్ని లైసెన్స్‌లనూ ఇక్కడే మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు.
 
కాగా, సోమవారం నుంచి జపాన్‌లో పర్యటిస్తున్న చంద్రబాబు అండ్ కో ఆ దేశ పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వంతో వివిధ అంశాలపై చర్చలు జరుపుతూ, కీలక ఒప్పందాలను కుదుర్చుకుంటున్నారు. ఇందులోభాగంగా.. ఇసుజు కంపెనీ తడలోని శ్రీసిటీ సెజ్‌లో టక్కుల తయారీ ఫ్యాక్టరీని నెలకొల్పనున్నట్టు ప్రకటించిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి