దేశంలో మూడో ధనిక ముఖ్యంమత్రిగా చంద్రబాబు

శుక్రవారం, 14 ఏప్రియల్ 2023 (14:16 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి దేశంలోనే అత్యంత ధనవంత ముఖ్యమంత్రిగా అవతరించారు. ఈయన ఆస్తి ఏకంగా రూ.510 కోట్లు. మిగిలిన 29 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సగటు ఆస్తి రూ.505 కోట్లు. అంటే మిగిలిన 29 మంది ముఖ్యమంత్రులను కలిపినప్పటికీ సీఎం జగన్ ఆస్తి అధికం. 
 
ఈ నేపథ్యంలో దేశంలో అత్యంత ధనవంతుడైన శాసనసభ్యుడిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిలిచారు. ఈయన మొత్తం ఆస్తి రూ.668 కోట్లు. రాష్ట్రంలో కోటీశ్వర ఎమ్మెల్యేల్లో మొదటి స్థానంలో ఉన్నారు. ఏడీఆర్ విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో మూడో ధనిక ఎమ్మెల్యేగా చంద్రబాబు అవతరించారు. మొదటి స్థానంలో ఎన్.నాగరాజు, రెండో స్థానంలో డీకే శివకుమార్‌లు ఉన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు