ఎఫ్‌ఐఆర్ చేర్చడం తప్పకపోవచ్చు: ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు

బుధవారం, 31 ఆగస్టు 2016 (13:58 IST)
ఓటుకు నోటు కేసులో దర్యాప్తు తీరు, కోర్టు ఆదేశాలను బట్టిచూస్తే నూటికి నూరు శాతం ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు అవడం ఖాయమని ఇంటెలిజెన్స్‌ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. 
 
చట్టప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత విచారణకు నోటీసులిచ్చే అధికారం దర్యాప్తు అధికారికి ఉంటుందన్నారు. చంద్రబాబు సీనియర్ సిటిజన్, పైగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడంతో ఆయన ఇంటికి వెళ్లి విచారించుకోవాల్సి ఉంటుందన్నారు. 
 
అలాగే, సీఆర్పీసీ ప్రకారం 60 యేళ్లు దాటిన వారిని పోలీస్ స్టేషన్‌కు, దర్యాప్తు సంస్థవద్దకు పిలువడం కుదరదని చెప్పారు. అందువల్ల నేరుగా చంద్రబాబు ఇంటికి వెళ్లి కేసు విషయంలో విచారణకు సహకరించేలా విజ్ఞప్తి చేయాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ ఆయన సహకరించకపోతే కోర్టు ద్వారా అరెస్ట్ వారెంట్ జారీచేసే అధికారం కూడా ఉంటుందని ఉన్నతాధికారులు చెపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి