విజయవాడ : ఒలింపిక్ క్రీడల్లో భారత్ పేరు నిలబెట్టిన పి.వి.సింధుకు ఏపీ ప్రభుత్వం ఘన సన్మానం చేసింది. రాష్ట్ర మంత్రుల ప్రతినిధి బృందం సింధును హైదరబాదు నుంచి ప్రత్యేకంగా విమానంలో తోడ్కొని గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. ఎయిర్ పోర్ట్‌లో సింధుకు విశేషంగా ప్రజలు, అధికారులు, మంత్రులు స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ర్యాలీగా విజయవాడకు వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విజయ రథంపై సింధును ఊరేగించారు.
సింధుతోపాటు కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా ఉన్నారు. వారికి విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆతిథ్యం ఇచ్చి స్వాగతం పలికారు. ఆ తర్వాత సభ ప్రారంభమైంది. ఈ సభలో సింధును ఘనంగా సత్కరించారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు ఆమెతో బ్యాడ్మింటన్ ఆడారు. అనంతరం పుష్కరాలు ముగింపు సందర్భంగా పవిత్ర సంగమం వద్ద హారతి కార్యక్రమానికి సింధు, పుల్లెల గోపీచంద్, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, సురేష్ ప్రభు హాజరయ్యారు. అక్కడ సింధుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రూ. 3 కోట్ల చెక్కును ప్రదానం చేశారు. పుల్లెల గోపీచంద్‌ను కూడా సత్కరించారు. ఈ మొత్తం వీడియో మీకోసం... చూడండి...