విజయవాడలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జనాలకు కష్టాలు వస్తే దేవుడిని నమ్ముకుంటారన్నారు. అలాగే, అందుకే ఎక్కువ తప్పులు చేస్తూ.. ఎక్కువ డబ్బులు హుండీల్లో వేస్తున్నారనీ, దీనివల్ల హుండీ ఆలయాల ఆదాయం పెరుగుతోందన్నారు. తద్వారా తాము చేసిన పాపాలు పోతాయని వారు భావనగా ఉందన్నారు.
ఏపీలో దేవాదాయశాఖ ఆదాయం బాగా పెరిగిందని, ఆ శాఖ ఆదాయ అభివృద్ధికి అధికారులు కష్టపడి పనిచేయకపోయినా, 27శాతం ఆదాయం పెరిగిందని చంద్రబాబు తెలిపారు. పక్కరాష్ట్రాల అభివృద్ధి చూసి అసూయ కలుగుతోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాల కంటే బాగా పని చేయడం కోసం ఆలోచిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.