బాబుకు సుప్రీంలో ఊరట లభించదా? 5న నుంచి భువనేశ్వరి బస్సు యాత్ర!

సోమవారం, 2 అక్టోబరు 2023 (09:30 IST)
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కేసు భవితవ్యం మంగళవారం తేలనుంది. తనపై నమోదుచేసిన అక్రమ కేసును కొట్టి వేయాలంటూ ఆయన దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరుగనుంది. అయితే, ఈ నెల 5వ తేదీ నుంచి ఆయన సతీమణి నారా భువనేశ్వరి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను చేపట్టాలని భావించడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబుకు సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. ఇదే జరిగితే ఆయన జైలు నుంచి విడుదలవుతారు. 
 
గత 24 రోజులుగా జైలులో ఉంటున్న చంద్రబాబు ఇంటికి వస్తే ఆయన బాగోగులను భువనేశ్వరి చూసుకోవాల్సి వుంది. అయితే, ఆమె ఐదో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు వెళ్ళాలని భావించడం ఇపుడు చర్చనీయాంశంగాను, అనుమానాస్పదంగా మారింది. సుప్రీంకోర్టులో కూడా చంద్రబాబుకు న్యాయం జరగదా అనే సందేహం ఉత్పన్నమవుతుంది. ఏది ఏమైనా... ఇంతకాలం బాహ్య ప్రపంచంలో పెద్దగా కనిపించని భువనేశ్వరి ఇపుడు భర్త జైలు పాలుకావడంతో పార్టీని కాపాడుకునేందుకు రోడ్డుపైకి రావడం ప్రతి ఒక్కరినీ కలిసివేస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు