జగన్ సిద్థంగా ఉండు, జైలు పిలుస్తోంది: చింతామోహన్

బుధవారం, 14 ఏప్రియల్ 2021 (20:14 IST)
తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం ముగియడానికి ఇక ఒకరోజు సమయం మాత్రమే ఉంది. దీంతో నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తారాస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా ఎంపిగాను, కేంద్రమంత్రిగాను పనిచేసిన చింతామోహన్, సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్సలు చేస్తున్నారు. 
 
జగన్ జైలుకెళ్ళడానికి సిద్థంగా ఉండాలని... సూట్ కేసులు, టీషర్టులు, పుస్తకాలు సర్దుకుని రెడీగా ఉండాలన్నారు. జగన్ అవినీతిపరుడని.. నియంత అంటూ మండిపడ్డారు. జగన్ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా స్వాతంత్ర్యం ఉద్యమంలో పాల్గొన్నారా అంటూ ప్రశ్నించిన చింతామోహన్ దేశం కోసం ప్రాణాలర్పించిన వ్యక్తి ఇందిరాగాంధీ అంటూ కొనియాడారు.
 
తన తండ్రిని అడ్డంపెట్టుకుని వేలకోట్లు అక్రమంగా సంపాదించిన వ్యక్తి జగన్ అంటూ ఆరోపించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో అవినీతి, అరాచక ప్రభుత్వాన్ని తరిమికొట్టండని ప్రజలకు కోరారు. కాంగ్రెస్ పార్టీతోనే తిరుపతి అభివృద్థి సాధ్యమని.. తనకు ఎంపిగా ఒక అవకాశం ఇవ్వాలని కోరారు చింతామోహన్. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు