మూడు రాజధానుల అంశంపై త్వరలో క్లారిటీ

సోమవారం, 29 నవంబరు 2021 (14:39 IST)
ఏపీ సర్కారు మూడు రాజధానుల అంశంపై త్వరలో క్లారిటీ ఇచ్చే అవకాశం వున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఉన్నతాధికారులతో సీఎం జగన్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా బిల్లు తయారీపై దృష్టి సారించినట్లు సమాచారం. ప్రస్తుతం సీఆర్డీఏ అమలులో ఉన్నందున అమరావతి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 
మరోవైపు మూడు రాజధానుల బిల్లు వ్యవహారం పైన హైకోర్టులో విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం తాజాగా తాము తీసుకొచ్చిన మూడు రాజధానులు సీఆర్డీఏ రద్దు బిల్లులను ఉప సంహరించుకుంటూ బిల్లు ఆమోదించింది. శాసనసభ, మండలిలో ఈ ఉపసంహరణ బిల్లుకు ఆమోదం లభించింది. 
 
దీనికి సంబంధించి అసెంబ్లీ స్పీకర్ మండలి ఛైర్మన్ ఆ ఉపసంహరణ బిల్లు ఆమోదం పొందినట్లుగా ఇచ్చిన లేఖలతో సహా ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. త్రిసభ్య ధర్మాసనం ఎదుట ఏపీ రాజధాని బిల్లల ఉపసంహరణ కేసు విచారణ జరిగింది.
 
అయితే గవర్నర్ ఆమోదంతో వచ్చిన తరువాత ఆ బిల్లులను పరిశీలించి పిటీషనర్ల వాదన పైన ధర్మాసనం నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని న్యాయవాదులు చెబుతున్నారు. దీంతో..మూడు రాజధానుల విషయంలో అటు ప్రభుత్వం వేసే అడుగులు..ఇటు న్యాయపరంగా చోటు చేసుకొనే పరిణామాలపైన ఆసక్తి నెలకొని ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు