ఏపీ కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైంది. జిల్లా పునర్విభజన అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం సమీక్ష నిర్వహించనున్నారు. ఇందులో కొత్త జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు, ఉద్యోగుల కేటాయింపులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో కొత్త జిల్లాలుగా ఏర్పడిన తర్వాత పాలనా, ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఏప్రిల్ 8వ తేదీన గవర్నర్‌తో సీఎం జగన్ భేటీ కానున్నారు. ఆ సమావేశంలో గవర్నర్‌కు కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ గురించి వివరిస్తారు. వచ్చేనెల 11వ తేదీ అపాయింట్‌మెంట్ కావాలని కోరనున్నారు. 11వ తేదీనే కొత్త కేబినెట్ కొలువు తీరనుంది. అదే రోజు కొత్త మంత్రులు, పాత మంత్రులకు సీఎం జగన్ విందు ఇస్తారు.
కొడాలి నాని స్థానంలో వసంత కృష్ణప్సాద్ పేరు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక పేర్ని నాని స్థానంలో సామినేని ఉదయభాను, వెల్లంపల్లి స్థానంలో కొలగట్ల లేదా అన్నెరాంబాబు, కృష్ణా జిల్లా నుంచి రేసులో పార్థసారధి, జోగి రమేష్ ఉన్నారు.
గుంటూరు నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి, అంబటి, గుంటూరు నుంచి విడుదల రజిని, మేరుగు నాగార్జున, ఆదిమూలపు స్థానం నుంచి సుధకర్‌బాబుకు దక్కే అవకాశాలున్నట్లు సమాచారం.