జనరంజకమైన పాలన అందిస్తున్న సీఎం జగన్: కరణం ధర్మశ్రీ

బుధవారం, 19 ఆగస్టు 2020 (08:16 IST)
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు జనరంజకమైన పాలనను అందిస్తున్నారని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని కొనియాడారు.

టీడీపీ ఐదేళ్లలో ఖర్చు పెట్టిన దాని కంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే సంక్షేమానికి ఎక్కువ ఖర్చు పెట్టామన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల నీరాజనాలు పొందుతున్న వ్యక్తి జగన్‌ అని అన్నారు

సంక్షేమ పథకాల పేరుతో గత ప్రభుత్వం ఎన్నో స్కాంలు చేసిందని కరణం ధర్మశ్రీ విమర్శించారు. స్వాతంత్ర దినోత్సవం రోజున పార్టీ కార్యాలయానికి వెళ్లకుండా ఇంటివద్దే జెండా ఎగురవేసిన వ్యక్తి చంద్రబాబని అన్నారు.

గతంలో న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేసిన వ్యక్తి చంద్రబాబేనని, న్యాయమూర్తుల ఫోన్లు టాపింగ్ అంటూ... అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి శ్రీకారం చుడితే చంద్రబాబు అడ్డుపడుతున్నారని, ఆయన విశాఖపై విషం చిమ్మితే ఎవరూ ఊరుకోరని కరణం అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు