అమెరికాలో జగన్.. రాష్ట్రంలో పెట్టుబడికి.. ఒకే ఒక్క ఫామ్ నింపితే చాలు

శనివారం, 17 ఆగస్టు 2019 (12:17 IST)
అమెరికా పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం జగన్‌కి ఘనస్వాగతం లభించింది. పరిశ్రమలకు పెట్టాలనుకునేవారికి రెడ్టేపిజం అడ్డంకులు తమ ప్రభుత్వంలో ఉండబోవని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. తమ రాష్ట్రంలో ఎవరైనా పరిశ్రమలు పెట్టాలనుకుంటే కేవలం ఒకే ఒక్క దరఖాస్తు నింపితే సరిపోతుందని, తన కార్యాలయమే దగ్గరుండి అన్ని పనులూ చేస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాల సముద్ర తీరం ఉందని, కొత్తగా పోర్టులు నిర్మిస్తున్నామని, వీటిలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. డీశాలినేషన్, మెట్రోరైళ్లు, బకింగ్హాం కాల్వ పునరుద్ధరణ, ఎలక్ట్రికల్ బస్సులు, వ్యవసాయ స్థిరీకరణ, నదుల అనుసంధానం, వ్యవసాయ రంగంలో పరిశోధనలు, వ్యవసాయ ఉప్పత్తులకు మార్కెటింగ్ విస్తరణ, ఆక్వా ఉత్పత్తులకు మార్కెట్ విస్తృతిలో అపార అవకాశాలున్నాయని చెప్పుకొచ్చారు. 
 
నాణ్యత, అధిగ దిగబడులు సాధించడానికి తామ చేసే ప్రయత్నాల్లో భాగస్వాములు కావాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఏ రాష్ట్రానికైనా కేంద్ర ప్రభుత్వ సహాయం అవసరమేనని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఇరుగుపొరుగు రాష్ట్రాలతో తమకు చక్కటి సంబంధాలున్నాయని చెప్పుకొచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు