ప్రధానితో భేటీకాకుండానే భాగ్యనగరికి చేరుకున్న సీఎం కేసీఆర్

గురువారం, 25 నవంబరు 2021 (10:13 IST)
ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సాయంత్రం హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీకాకుండానే ఆయన తిరిగివచ్చారు. 
 
రాష్ట్రం నుంచి వరిధాన్యం సేకరించాలని కేంద్ర మంత్రులతో పాటు ప్రధాని మోడీని కోరడానికి కొందరు మంత్రులు, అధికారులతో కలిసి ప్రత్యేక విమానంలో ఆదివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. ఆ తర్వాత మూడు రోజుల పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి ధాన్యం కొనుగోలుపై చర్చించి, వినతి పత్రాలు సమర్పించేలా తెరాస నేతలకు దిశానిర్దేశం చేశారు. 
 
అయితే, ఏ ఒక్క మంత్రి నుంచి సరైన సమాధానం రాలేదు. అదేసమయంలో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యేందుకు సీఎం కేసీఆర్ శతవిధాలా ప్రయత్నించారు. ప్రధాని అపాయింట్మెంట్ కోసం ఢిల్లీలోనే మకాం వేశారు. కానీ, ప్రధాని ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో సీఎం కేసీఆర్‌ను కలుసుకునేందుకు సమయం కేటాయించలేక పోయారు. దీంతో సీఎం కేసీఆర్ హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు